మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించిన చిత్రం `పంచతంత్ర కథలు`. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, నిహాల్ కోదర్తి, అజయ్ కతుర్వర్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, సాదియ కీలక పాత్రలు పోషించారు. ఐదు కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు ఓటీటీ అయిన `ఆహా`లో విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దాని గురించి ఐదు మాటల్లో చెబుతాను. దర్శకుడు, కెమెరామేన్ ఒకరే కనుక చాలా అద్భుతమైన చిత్రీకరణ జరిగింది. మంచి, మంచిలొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి మాటలు, మంచి సెలక్షన్ ఆఫ్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కుదిరింది. రెండోవది…కులవ్యవస్థ గురించి, పెద్ద కులం, చిన్న కులం కాకుండా…ప్రేమకు కులాలు అడ్డురావు అనే అంశాన్ని చాలా సున్నితంగా, ఎక్కువ మెలో డ్రామా లేకుండా చాలా చక్కగా తీశాడు. నటీనటులు కూడా చాలా చక్కగా చేశారు. కచ్చితంగా చూడాల్సిన ఎపిసోడ్ ఇది. మూడోపాయింట్..అహల్య అనే మరో షార్ట్ స్టోరీలో..తన బిడ్డను పోషించుకోవడం కోసం వ్యభిచారిణిగా మారిన అమ్మాయి, పెయింటర్ మధ్య జరిగే ఎపిసోడ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందులో హీరో హీరోయిన్ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. హృదయానికి హత్తుకునేలా చిన్న చిన్న మాటలతో చాలా చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు. నాలుగవ పాయంట్.. తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్‌గారు ఇద్దరు కొడుకులు ఉండడంతో ఏ ఇంట్లో ఉండాలి అనే విషయం ఎంతో సున్నితంగా..ఎంతో ఆలోచింపజేసే విధంగా తీశారు. గీత భాస్కర్ గారు చాలా నేచురల్‌గా చేశారు. పంచతంత్ర కథలు అని పేరు పెట్టినందుకు ఐదు చక్కటి కథల్ని కమర్షియాలిటీ లేదేంటి?.. ఫైట్లు గట్రా లేవేంటి? అనే ఆలోచన లేకుండా నిర్మించిన నిర్మాత మధుకి ఈ సినిమా మరింత మంచి విజయం సాధించి మునుముందు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా..అలాగే దర్శకుడు శేఖర్, మిగతా ఆర్టిస్టులకి కూడా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు పంచతంత్ర కథలు టీమ్“ అన్నారు. తారాగణం: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ తదితరులు సాంకేతిక వర్గం: నిర్మాణ సంస్థ: మధు క్రియేషన్స్ నిర్మాత: డి. మధు రచన-దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: కమ్రాన్ కో ప్రొడ్యూసర్: డి. రవీందర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకూరి సాయికుమార్ మాటలు, లైన్ ప్రొడ్యూసర్: అజర్ షేక్ సినిమాటోగ్రఫి: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి కాస్టూమ్ డిజైనర్, స్టైలిస్ట్: రితీషా రెడ్డి సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యాం, మామా సింగ్ పిఆర్ఓ: శ్రీను దుద్ది, సిద్ధు