తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు క్రీడల మంత్రిత్వ శాఖను సీఎం స్టాలిన్ కట్టబెట్టారు. ఈ సందర్భంగా డీఎంకే నేతలు, మంత్రులు, కార్యకర్తలు, తమిళనాడు ప్రముఖులు, సినీ ప్రముఖులు, దేశంలోని ప్రముఖులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా రాఘవ లారెన్స్ కూడా ట్విట్టర్ వేదికగా ఉదయనిధికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర యువజన, క్రీడల శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ఉదయనిధికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.
https://twitter.com/offl_Lawrence/status/1603027080736038912?s=20&t=QHfUrTFWcFQQrxAPHsToBA












