యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్న పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు. https://cinemaabazar.com/
ఇదిలా ఉంటే పుష్ప2 సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇలాంటి టైమ్ లో ఈ సినిమాలో తన పాత్ర గురించి హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో రష్మిక పుష్ప2లో తన పాత్ర గురించి, సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పుష్ప మొదటి భాగం స్టార్ట్ చేసినప్పుడు తమ పాత్రలు ఎలా ఉంటాయనేది, వాటికి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియదని, కానీ పుష్ప2 విషయంలో అలా కాదని చెప్పింది. https://cinemaabazar.com/
పుష్ప2లో ప్రతి పాత్రను సుకుమార్ ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేశాడని, పుష్పలో శ్రీ వల్లి పాత్రకు, పుష్ప2లో శ్రీవల్లి పాత్రకు చాలా తేడా చూస్తారని రష్మిక తెలిపింది. మొత్తానికి పుష్ప2 గురించి యూనిట్ సభ్యులు చెప్తున్న మాటలు రోజురోజుకీ అంచనాలను ఆకాశానికంటిస్తున్నాయి. ఈ హైప్ ఆగస్ట్ వరకు ఇలానే పెరుగుతూ పోతే, పుష్ప2 ఓపెనింగ్స్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయం. https://cinemaabazar.com/