వైజాగ్ లో పుష్ప-2 మూవీ షూటింగ్….

పుష్ప-2 సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప2. ఇటీవలే హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి సన్నివేశాల కోసం, ముఖ్యంగా షిప్ యార్డ్ సన్నివేశాల కోసం వైజాగ్ లో చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. నిజానికి వైజాగ్ కంటే ముందే బ్యాంకాక్ ను చిత్రం యూనిట్ ఎంపిక చేసుకుంది.కానీ.. అక్కడ పర్మిషన్ రాలేదని తెలుస్తోంది. అందుకే వైజాగ్ ఎంపిక చేసుకున్నారు. అక్కడ పది రోజుల పాటు హీరోపై సాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారనీ, ఫిబ్రవరిలో హీరోయిన్‌ రష్మిక సెట్‌లోకి రాబోతున్నట్లు అంటున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రూపొందిన ‘పుష్ప-1’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో పుష్ప-2పై మరింత దృష్టి సారించారు.

Related Posts

Latest News Updates