అవినీతి ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఉద్యావన మంత్రి ఫౌజా సింగ్ సరారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సమర్పించారు. అందులో మాత్రం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ… కాంట్రాక్టుల విషయంలో డబ్బు తీసుకునే విషయంపై ఆయన ఓఎస్డీ తర్సేమ్ లాల్ కపూర్ తో మంత్రి ఫౌజా సింగ్ మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఇది 4 నెలల క్రితం వీడియో. ఇప్పుడు బయటపడటంతో విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఫౌజాను మంత్రివర్గం నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే… ఈ ఆరోపణలను మంత్రి ఫౌజా ఖండిస్తున్నారు. ఆ ఆడియోలో ఉన్నది తన మాటలు కాదని, ఇదంతా కుట్ర అంటూ పేర్కొన్నారు. అయితే.. మంత్రి పదవికి రాజీనామా చేసినా… పార్టీలోనే వుంటానని ప్రకటించారు.
పంజాబ్ లో ఆప్ సర్కార్ కొలువుదీరి… 9 నెలలు అవుతోంది. అవినీతి ఆరోపణలతో మంత్రులు రాజీనామా చేయడం ఇది రెండో సారి. మొదటి సారి.. ఆరోగ్య మంత్రిగా వున్న విజయ్ సింగ్లా కూడా రాజీనామా చేశారు. మంత్రిపై ఆరోపణలు రావడం, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా బయట రావడంతో మంత్రివర్గం నుంచి సీఎ ఆయన్ను తొలగించారు. ఏసీబీ మంత్రి అరెస్ట్ కూడా చేసింది. ఇప్పుడు రెండో వ్యక్తి ఫౌజా సింగ్












