‘ప్రొడ్యూసర్ గిల్డ్’ మాఫియాగా మారింది: సి.కళ్యాణ్

ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.ప్రొడ్యూసర్ గిల్డ్ మాఫియాగా మారిందని ఆరోపణలు చేశారు. దీని వల్ల సినీ ఇండస్ట్రీ నాశనం అవుతోందని విమర్శించారు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉంటే గిల్డ్ 27 మంది సభ్యులున్నారని తెలిపారు. ఇక గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనమవుతోందని అన్నారు.రేపు జరగబోయే ఎలక్షన్స్ అందరినీ ఆహ్వానిస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు సి.కళ్యాణ్.

2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు ప్రెసిడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా రెండవ సారి ఎన్నుకో పడ్డాను. ఇది నాకు ఇష్టం లేక పోయినా ఎవరో వచ్చి కూర్చునే బదులు నువ్వు ఉంటే బావుంటుందని అందరూ చెప్పడంతో నేను ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కు పోటీలో ఉండే పేర్లు చూస్తే ఎవరు సంస్థకు న్యాయం చేస్తారు, ఎవరు కమిషన్లు తీసుకోరు, ఎవరు సంస్థను లీడ్ చేస్తారు అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ రేపు తప్పకుండా రండి. కళ్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం మీకు కలిగితే మీరందరూ వచ్చి మా ప్యానల్ కు వచ్చి ఓటెయ్యండి. ఈ ఆర్గనైజేషన్ ను కాపాడండి.చాలా మంది గిల్డ్ ఏంటి కౌన్సిల్ ఏంటి రెండింటినీ కలిపేయొచ్చు కదా అని అన్నారు.ఆలా కలిపడానికి పుట్టిందే మా ప్యానల్. దీనిని విఫలయత్నం చేయాలనుకున్నారు కొందరు దుండగులు. వారు ఆ సీటు మీద ఉండే వ్యామోహంతో చేయడమే కాకుండా దిల్ రాజు గారిని నన్ను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.దిల్ రాజు గారే నాతో చెప్పారు.

 

నాకు వేరే ప్రాజెక్ట్స్ లలో బిజీ గా ఉన్నాను.కిరణ్ ఈజ్ గుడ్ అన్నాడు.కిరణ్ కు కూడా ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసు, తను మిగతా వారిలా డబల్ గేమ్స్ ఆడడు. నేను ఇప్పటి వరకు 80 సినిమాలు తీశాను. ఏ డిస్ట్రిబ్యూటర్ ని నేను ఇబ్బంది పెట్టలేదు. ఇందులో ఉన్న 1200 మంది మెంబెర్స్ ఆవేదన నాకు తెలుసు. ఇక్కడంత మోనో పలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్ ఇలా వారు ఇండస్ట్రీ ని శాశిస్తున్నారు. ఇదంతా పెద్ద మాఫియా..మొదట దాసరి గారు చిన్న సినిమా కనిపించకుండా పోకూడదు. అందరూ ఒకే తాటిపై ఉండాలని స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ చిన్నగా LLP గా మారి అది కాస్తా గిల్డ్ గా మారింది. సినిమా తీసుకుంటే తప్పు లేదు కానీ ఇలా మోనో పలిగా చేయడం ఎందుకు.చిన్న సినిమా అనేది లేకుంటే ఇండస్ట్రీ అంతా మూత పడిపోతుంది. నేను చెప్పాను మీరు 70% మీవారి లిస్ట్ ఇవ్వండి. మేము 30% లిస్ట్ ఇస్తాము అని చెప్పాము.
రేపు జరగబోయే ఎలక్షన్ వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించి ఈ సంస్థను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను

Related Posts

Latest News Updates