డ‌బుల్ ఇస్మార్ట్ కు స‌మ‌స్య‌లు

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న డ‌బుల్ ఇస్మార్ట్ జూన్ లో రిలీజ్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ ప‌రిస్థితులు చూస్తుంటే అదంత ఈజీ అనిపించ‌డం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్ర‌కారం డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఇప్ప‌టికే ముప్పాతిక భాగం కంప్లీట్ అయింది. మ‌రో రెండు, మూడు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి.

మ‌ణిశ‌ర్మ ఇస్తున్న ట్యూన్స్ నుంచి బెస్ట్ రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్న పూరీ ఆ కార‌ణంగానే రికార్డింగ్ లేట్ చేస్తున్నార‌ని టాక్. ఇస్మార్ట్ శంక‌ర్ కంటే మించి అదిరిపోయే సాంగ్స్ సెట్ చేసుకోవాల‌ని పూరీ ఆలోచిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే డిజిటల్, ఓటీటీ డీల్స్ పూర్తైన‌ప్ప‌టికీ మిగిలిన భాగం ఎప్పుడు పూర్త‌వుతుందో క్లారిటీ లేక రిలీజ్ డేట్ ను డిసైడ్ చేయ‌లేక‌పోతున్నార‌ట‌.

దానికి తోడు ఇప్ప‌టికే బ‌డ్జెట్ అనుకున్న దాని కంటే పెరిగిపోవ‌డం, లైగ‌ర్ ఎఫెక్ట్ పూరీ మీద‌, స్కంద ఎఫెక్ట్ రామ్ మీద ఉండ‌టంతో సినిమాకు క్రేజ్ భారీ రావ‌డం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ బ్రాండ్ మీద బిజినెస్ ఎక్కువ‌గా జ‌రుగుతుంది త‌ప్పించి హీరో- డైరెక్ట‌ర్ కాంబోలో వ‌ల్ల కాదు. డ‌బుల్ ఇస్మార్ట్ ప‌నుల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్లే పూరీ అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు. వీలైనంత త్వ‌ర‌గా పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేస్తే త‌ప్పించి డ‌బుల్ ఇస్మార్ట్ కు మంచి రిలీజ్ డేట్ దొర‌క‌దు.  

Related Posts

Latest News Updates