అద్వాణీ నివాసానికి ప్రధాని మోదీ… బొకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వాణీ నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా మోదీ ఆయనకు పూల బొకేను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ వెంట కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వున్నారు. రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అద్వాణీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లాం. ఆయన ఆయురారోగ్యాలతో వుండాలని దేవుడ్ని ప్రార్థించాను అని రాజ్ నాథ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అద్వాణీ ప్రతి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ వుంటారు.

Related Posts

Latest News Updates