కాలుష్యం పెరగడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంతవరకు ఈ మూసివేత కొనసాగుతుందన్నారు. ఐదు, అంతకంటే పైతరగతుల విద్యార్థుల అవుట్‌డోర్‌ గేమ్స్‌ను కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. వీటితో పాటు ట్రాఫిక్‌లో ‘సరి-బేసి’ని అమలు చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తూనే వున్నామని అన్నారు.

 

 

వాయు కాలుష్యం సమస్య కేవలం ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని, దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సరికాదన్నారు. అయితే… తిరిగి పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో కేజ్రీవాల్ ఇదమిత్ధంగా చెప్పలేక పోయారు. మరోవైపు నోయిడాలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాలలు నిర్ణయించుకున్నాయి. తిరిగి మామూలు పరిస్థితులు వచ్చే వరకూ ఆన్ లైన్ క్లాసులనే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

Related Posts

Latest News Updates