భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ  ప్రకటించింది. భారత్‌-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాయి.  ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే తొలిసారి.

Related Posts

Latest News Updates