శ్రీశైల దేవస్థానాన్ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం అధికారులు, అర్చకులు, మంత్రులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

దర్శనం తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాష్ట్రపతికి అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌సాద్ ప‌థ‌కం కింద 43 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శివాజీ, భవానీ మాత విగ్రహాలకు ముర్ము పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత అక్కడి సిబ్బంది, అధికారులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

Related Posts

Latest News Updates