మరోసారి ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ముర్ము… ఈ నెల 26 న శ్రీశైలానికి రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. కొన్ని రోజుల క్రిందటే ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విశాఖ సాగరతీరంలో జరిగిన నేవీడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. తాజాగా… రాష్ట్రపతి ముర్ము మరోసారి ఏపీకి రానున్నారు. ఈ సారి శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించుకోనున్నారు.

ఈ నెల 26 న రాష్ట్రపతి ముర్ము శ్రీశైలం దేవస్థానం దర్శనానికి రానున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 26 న మధ్యాహ్నం 12:15 ప్రాంతంలో ముర్ము శ్రీశైలానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత శ్రీశైల దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Related Posts

Latest News Updates