దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, వెలుగులను, ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. ఈ పవిత్రమైన వెలుగు, ఆనందాల పండుగ రోజున జ్ఞానం, శక్తి అనే దీపాన్ని వెలిగించి దీనుల జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిద్దామని రాష్ట్రపతి ముర్ము అన్నారు.

 

ఈ గొప్ప పండుగ రోజున దేశప్రజలందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానన్నారు. ఈ దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక వీరితో పాటు… ఉప రాష్ట్రపతి ధన్కర్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్