కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వున్న వేడి రాష్ట్రపతి ముర్ము రాకతో కాస్త చల్లబడ్డాయి. ఎప్పుడూ విమర్శలు చేసుకుంటున్న అందరూ కలిసిపోయారు. ఒకరినొకరు హాయిగా పలకరించుకున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకే వేదికను కూడా పంచుకున్నారు. శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై కలిసి స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రపతికి ప్రజా ప్రతినిధులను పరిచయం చేసే కర్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి తదితరులు వున్నారు.
నేతలందరూ క్యూలో రాగా… సీఎం కేసీఆర్ వారందర్నీ రాష్ట్రపతికి పరిచయం చేశారు. అయితే.. బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ని కూడా సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు. బండి సంజయ్ కి నమస్కారం చేశారు సీఎం. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. నిత్యం బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఆసక్తిగా మారిపోయింది. ఒకే ఫ్రేమ్ లో గవర్నర్, సీఎం, బండి సంజయ్ అంటూ తెగ వైరల్ చేసుకుంటున్నారు.