మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.
రీసెంట్ గా “ట్రూ లవర్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వస్తోంది. స్పెషల్ షో ద్వారా ఈ సినిమా చూసిన వారంతా రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి మంచి లవ్ స్టోరీ రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్ లోనూ “ట్రూ లవర్” సినిమా చూడాలనే బజ్ క్రియేట్ అవుతోంది.
నటీనటులు – మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – రాజ్ కమల్
కాస్ట్యూమ్స్ – నవా రాజ్ కుమార్
ఎడిటింగ్ – భరత్ విక్రమన్
సినిమాటోగ్రఫీ – శ్రేయాస్ కృష్ణ
మ్యూజిక్ – సీన్ రోల్డన్
తెలుగు డైలాగ్స్ – మౌళి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – హరీశ్ దురైరాజ్
ప్రొడక్షన్ కంట్రోలర్ – బాల మురుగన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – గుడ్ నైట్ ఆర్ నాగరాజన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్స్ – మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్స్ – నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్
తెలుగు రిలీజ్ – మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్
ప్రెజెంటర్స్ – మారుతి, ఎస్ కేెన్
రచన దర్శకత్వం – ప్రభురామ్ వ్యాస్