అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పోటీ చేస్తానని రెండు నెలల కిందటే ప్రకటించారు. తాజాగా ప్రచారం మొదలు పెట్టారు. ఎర్లీ ఓటింగ్ జరిగే రాష్ట్రాలు న్యూ హాంప్ షైర్, సౌత్ కరోలినాలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ మరోమారు అధ్యక్షుడిగా సేవలందించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తన కమిట్మెంట్ పై కొంతమంది ప్రజల్లో ఉన్న సందేహాలను ట్రంప్ పటాపంచలు చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరం కలిసి అమెరికాను అద్భుతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెడదామని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.