ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆయా హీరోల పుట్టిన రోజులు, ఆయా సినిమాల రోజుల సందర్భంగా ఆ హీరోలకు సంబంధించిన పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో వేస్తున్నారు. ఈ ట్రెండ్ కు అభిమానులు కూడా భలే ఫాలో అవుతూ… ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి కోవలోకి ఇప్పుడు ప్రేమదేశం వచ్చి చేరింది. డిసెంబర్ 9 న ఈ సినిమాని మళ్లీ థియేటర్లలో వేస్తున్నారు. స్నేహానికి ఈ సినిమాలో అమిత ప్రాధాన్యం ఇచ్చారు.

టబు, వినీత్, అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా చాలా నీట్‌గా చిత్రాన్ని తీశారు. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్ పై రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి, నాగరాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ప్రేమదేశం సినిమా స్పెషల్ షో హైదరాబాద్ లో వేశారు, నటి దివి, నటి శ్రేయ ప్రియ, అర్జున్ కళ్యాణ్ ఈ స్పెషల్ షో కు హాజరయ్యారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత కెటి.కుంజుమొన్ హాజరయ్యి ప్రేమదేశం సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.












