ప్రీ రిలీజ్ విడుకల్లో దళారీ చిత్రం, డిసెంబర్ 15న విడుదల

ఆకృతి క్రియేషన్స్ పతాకం పై రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్‌రెడ్డి తన రచన తో దర్శకత్వం వహించిన చిత్రం “దళారి”. ఎడవెల్లి వెంకట్‌ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 15 న కర్ణాటక మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదల అవుతుంది. అయితే ఈరోజు చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా

దర్శకుడు కాచిడి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ “మా దళారీ చిత్రం మాస్ ప్రేక్షకులకి అద్భుతంగా నచ్చుతుంది. ఒక ఊరులో వెంకట్ రెడ్డి అనే వ్యక్తి జీవితం ని ప్రేరణ గా తీసుకుని చేసిన కథ. నేటి సమాజంలో సమస్యలను మా చిత్ర కథగా చుపించాము. నిర్మాత దళారీ 2 తీయటానికి సిద్ధంగా ఉన్నారు. వారికీ నా కృతజ్ఞతలు. రాజీవ్ కనకాల మరియు శకలక శంకర్ గార్ల నటన అద్భుతంగా ఉంటుంది. మా చిత్రం డిసెంబర్ 15న విడుదల అవుతుంది” అని తెలిపారు.

నిర్మాత వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ “మా దళారీ సినిమా డిసెంబర్ 15న విడుదల అవుతుంది. మంచి టెక్నిషన్స్ తో నిర్మించాము. సినిమా బాగా వచ్చింది. దళారీ చాలా గొప్ప టైటిల్, మొదటి రోజు నుంచి హౌస్ ఫుల్ తో సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం నా కుంది. త్వరలోనే దళారీ 2 తీస్తాను, సినిమా చాలా బాగా వచ్చింది. మా రాజీవ్ కనకాల గారు శకలక శంకర్ గారు బాగా సపోర్ట్ చేసారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది” అని తెలిపారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ “శకలక శంకర్ చాలా కష్ట జీవి, చాలా బాగా నటించాడు. సినిమా బాగా వచ్చింది. మంచి కథ, మంచి టెక్నిషన్స్ తో నిర్మించాము. చాలా కొత్తగా ఉంటుంది. డిసెంబర్ 15న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

శకలక శంకర్ మాట్లాడుతూ “మా దళారీ సినిమా ని రెండు భాగాలుగా నిర్మించాము, ఇప్పుడు మొదటి భాగం విడుదల అవుతుంది, తర్వాత రెండో భాగం విడుదల అవుతుంది. ఇందులో మంచి కథ ఉంది, మంచి యాక్షన్ ఉంది, రాజీవ్ కనకాల గారి నటన అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది.

నటీనటులు : రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక, గిరిధర్‌, జెమిని సురేష్‌, గెటప్‌ శ్రీను, రాం ప్రసాద్‌, రఛ్చరవి,  RX 100 లక్ష్మణ్, కృష్ణేశ్వర రావు, సురేష్‌ కొండేటి.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ : హరిగౌర,
లిరిక్స్‌ :  సుద్దాల అశోక్‌ తేజ మరియు సురేష్‌ గంగుల,
సింగర్స్‌ :  సాయి చరణ్‌ భాస్కరుని మరియు హరిగౌర
కో డైరెక్టర్స్ – నాగేంద్ర, రాజశేఖర్
డి.ఒ.పి :  మెంటం సతీష్‌
ఎడిటర్‌ : నందమూరి హరి
కొరియోగ్రఫి రాజ్‌ పైడ
ఆర్ట్‌ : రాజ్‌ అడ్డాల
స్టంట్స్‌ : పృధ్వి
ప్రొడక్షన్‌ : ఆలూరి రాము మరియు రాజ వంశి
లైన్ ప్రొడ్యూసర్ – అనిల్ రెడ్డి
నిర్మాత : వెంకట్‌ రెడ్డి
రచన, దర్శకత్వం : కాచిడి గోపాల్‌రెడ్డి.

Related Posts

Latest News Updates