తిరుప్పావై –22వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ వన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము…
సుందరము, విశాలము నగు మహాపృటివీమండలము నంతను ఏలిన రాజులు తమకంటె గొప్పవారు లేరెనెడి అహంకారమును వీడి, తమను జయించిన సార్వభ్ॐఉని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగ చేరియున్నట్లు, మేమును అభిమానభంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగ చేరి యున్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వువలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నుఅను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుము.
సూర్యచంద్రు లిరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించున ట్లుండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా! మేము అనుభవించియే తీరవలె ననెడి శాపమువంటి కర్మకూడ మమ్ములను వీడిపోవును.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు
