తిరుప్పావై –25వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదంతో
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలానాగి త్తాన్ తీఙ్గు నినైన్ద
కరుత్తై ప్పిళ్ళైపిత్తు కఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడు మాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాకిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము…
భగవానుడే తనకు కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీదేవకి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయవైభవముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై, నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రితవ్యామోహము గలవాడా! నిన్నే కోరి వచ్చినారము. పఱ యను వాద్యము నిచ్చినిమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము.