శ్రీ కామాక్షి పీఠం ఆస్థాన సిద్ధాంతి కర్రా వీరభద్రానికి ”ప్రాగ్జ్యోతిష్ గ్లోబల్ అఛీవర్స్ అవార్డ్”

ప్రాగ్జ్యోతిష విశ్వ విద్యా పీఠ్ వారి ఆధ్వర్యంలో గౌహతిలో జరుగుతున్న నేషనల్ ఆస్ట్రో కాన్ఫరెన్స్ లో శ్రీ కామాక్షి పీఠం మహా సంస్థానం ఆస్థాన సిధ్ధాంతి డా. కర్రా వీరభద్రానికి ప్రాగ్జ్యోతిష్ గ్లోబల్ అఛీవర్స్ అవార్డ్ ను “ప్రాగ్జ్యోతిష విశ్వ విద్యా పీఠ్” వారు అందించారు. అదేవిధంగా నేషనల్ ఆస్ట్రో ఫేర్ ప్రత్యేక పురస్కారం కూడా అందించారు.భారతీయ జ్యోతిష శాస్త్రానికి,ముఖ్యంగా పంచాంగ గణితం,మంత్ర శాస్త్రంలో చేస్తున్న విశేష కృషిని, సేవల్ని గుర్తించి ఈ అవార్డులను ప్రాగ్జ్యోతిష విశ్వ విద్యా పీఠ్” అందించింది. కాగా ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ కి చెందిన మహామండేశ్వర్ మరియు ప్రాగ్జ్యోతిష విశ్వ విద్యా పీఠ్ చైర్మన్ తోపాటు,డా. మహేశ్చంద్ర భరద్వాజ గారు,డా.హేమంత్ కుమార్ పాల్గొన్న ఈ సభలో దేశంలోవివిధ రాష్ట్రల నుండి జ్యోతిష్య శాస్త్ర పండితులు పాల్గొనడం జరిగింది.

Related Posts

Latest News Updates