తీక్షణమైన విలన్‌ పాత్రలో ప్రభాస్ – ‘బ్రహ్మరాక్షస’ సినిమా వచ్చే మూడు ఏళ్లకే?

ప్రభాస్ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో నెంబర్‌ వన్‌ హీరోగా కొనసాగుతూ, వరుసగా ఐదు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “ది రాజా సాబ్‌,” సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో “స్పిరిట్,” హను రాఘవపూడి డైరెక్షన్‌లో “ఫౌజీ” అనే సినిమాలు చేస్తూ షూటింగ్‌లో ఉన్నారు. వీటితో పాటు “సలార్ 2” మరియు “కల్కి 2” సీక్వెల్స్ కూడా ప్రభాస్ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం “రాజా సాబ్‌” చిత్రానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫౌజీ సినిమా షూటింగ్ మొదలైంది కానీ, ఈ సినిమా సెట్స్‌కి ప్రభాస్ ఇంకా వెళ్లలేదు. “రాజా సాబ్‌” పూర్తి కాగానే, ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న “స్పిరిట్” అనే యాక్షన్‌-వయొలెంట్‌ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2025 ముగిసే వరకు ప్రభాస్ ఈ మూడు సినిమాల్లో పూర్తిగా బిజీగా ఉంటారని, తదుపరి ప్రాజెక్టులు 2026లో మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మతో “బ్రహ్మరాక్షస” అనే ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. “బ్రహ్మరాక్షస”లో ప్రభాస్ పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని, ఇది ఆయన గతంలో చేసిన “బిల్లా” చిత్రంలోని పాత్రలా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడం, ప్రశాంత్ వర్మ తన ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన, ఈ ప్రాజెక్ట్ త్వరలో మొదలయ్యే అవకాశం తక్కువగా ఉంది.

ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌ లో సినిమా కోసం అభిమానులు కనీసం మూడు సంవత్సరాలు ఆగాల్సి రావొచ్చు.

Related Posts

Latest News Updates

‘దేవకీ నందన వాసుదేవ’100% మంచి సినిమా. ఐదు నిముషాలు చూస్తేనే థియేటర్స్ కి వెళ్లి చూడాలనే ఫీల్ వచ్చింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను