సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆయన స్వగహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలు అభిమానులు హాజరయ్యారు. అభిమాన హీరోని చూడటానికి ఫ్యాన్స్ లోపలికి రావటానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అయితే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి.. అక్కడున్న వారిని చెదరగొట్టారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో.. సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆయన స్వగహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలు అభిమానులు హాజరయ్యారు. అభిమాన హీరోని చూడటానికి ఫ్యాన్స్ లోపలికి రావటానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అయితే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి.. అక్కడున్న వారిని చెదరగొట్టారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో అడుగు పెట్టడంతో ఫ్యాన్స్ భారీ స్థాయిలో అక్కడిచి వచ్చారు. కొందరు అభిమానులు అయితే బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్ష మందికి 25 రకాల వంటకాలతో భోజన వసతిని ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు సెప్టెంబర్ 11న అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.