విశాల్ హీరోగా ప‌వ‌ర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్

తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉన్న తమిళ స్టార్ యాక్షన్ హీరోల్లో విశాల్‌ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంటాడీ యంగ్‌ హీరో. సమాజంలో ఉన్న సమస్యలపై సినిమాలు తీసే విశాల్‌.. తన ప్రతీ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక నూత‌న ద‌ర్శ‌కుడి అవ‌కాశం ఇవ్వ‌బోతున్న ప్రాజెక్టు ఇప్పుడు సౌతిండియా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ముంబా దేవి ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై ‘కిస్మత్ 2025’ అనే వర్కింగ్ టైటిల్‌లో విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా చేయ‌బోతున్నాడు. నూతన దర్శకుడు రవి రోహిత్ ఈ ప్రాజెక్టును తెర‌కెక్కించ‌నున్నాడు. ప్రస్తుత సామాజిక, జాతీయ భద్రతా సమస్యలపై రూపుదిద్దుకోబోతున్న‌ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో విశాల్ పాత్ర మ‌రింతా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే విశాల్ ప్ర‌క‌టించ‌బోతున్నారు.

Related Posts

Latest News Updates