ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లోనూ పోసాని వైసీపీ తరపు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. జగన్ వైసీపీ స్థాపించినప్పటి నుంచే పోసాని మద్దతు తెలుపుతూ వస్తున్నారు.