పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారన్నది స్పష్టమైపోయింది. అతి కొద్ది రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే… పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగచాటుగా పార్టీ మారే అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. పార్టీ అంటూ మారాల్సి వస్తే.. ఖమ్మం నడిబొడ్డున అభిమానులు, కార్యకర్తల సమక్షంలోనే మారుతానని ప్రకటించారు. అయితే… ఏ పార్టీలో వున్నా సరే… కార్యకర్తలకు మాత్రం అండగా వుంటానని స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ తర్వాత పొంగులేటి బీజేపీలో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి.