మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్… సాయంత్రం 6 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక… నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలోని పోలింగ్ స్టేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

మునుగోడులోని 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. 2 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం బ్యాటరీల్లో సమస్య తలెత్తిందని తెలిపారు. అయితే వెంటనే సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితులను గమనిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ తో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు ఈసీ అనుమతిచ్చింది.