హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ సాగింది. భారీ సాయుధ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ ఆరంభమైంది. పోలింగ్ కేంద్రాల ముందు శనివారం ఉదయం ఓటర్లు బారులు తీరారు.
हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 12, 2022
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకొని, రికార్డు సృష్టించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొనాలని, హిమాచల్ లోని ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ లో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలని ఓటర్లందరినీ కోరుతున్నట్టు ప్రధాని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ రోజు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లకు కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటు వేసిన రాష్ట్ర యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అని అదే ట్వీట్లో రాసుకొచ్చారు.












