గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకూ ఈ పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో 19 జిల్లాలోని 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా మొత్తం 14,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

ఇక… ప్రముఖులందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాలా, మన్సుఖ్ మాండవీయ, దర్శన జర్దోష్, మాజీ సీఎం విజయ్ రూపానీ, క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రీవాబా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని సైకిల్ పై సిలిండర్ తో ఓటెయ్యడానికి వచ్చారు.












