జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్యంపై వేటు పడుతుందని వస్తున్న వార్తలపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన లేఖపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న కారణంతో జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వం వారి ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గడ్‌కు పంపించింది. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ రమేశ్ బియాస్ ఢల్లీి బయలుదేరి వెళ్లారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవాలని అధికార యూపీఏ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కోరారు. ఆ మరునాడే గవర్నర్ రమేశ్ బయాస్ ఢల్లీికి బయలుదేరి వెళ్లడం మరింత అనుమానాలకు తావిస్తున్నది. త్వరలో సందేహాలన్నీ నివృతి చేస్తారని సమాచారం. అయితే, రాజ్‌భవన్ వర్గాలు మాత్రం గవర్నర్ వ్యక్తిగత పర్యటన మీద ఢల్లీికి వెళ్లినట్లు పేర్కొన్నాయి.