తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలిలో పలు ఆధారాలను సేకరించారు. అనుమతికి మించి ముడి సరుకును యజమానులు నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 5 కిలోల వరకు మాత్రమే ముడిసరుకు నిల్వకు అనుమతి వున్నా…. నిర్వాహకులు అధికంగా నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అయితే… ప్రస్తుతానికి పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి తాడేపల్లిగూడెం పట్టణం వరకూ భూమి కంపించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ₹.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.












