దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది ‘రోజ్ గార్ మేళా’ను ప్రారంభించిన మోదీ

దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సిబ్బందికి రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి విడతలో నూతనంగా ఎన్నికైన 75 వేల మందికి నియామక పత్రాలను అందజేస్తారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజల సంక్షేమానికి భరోసా ఇవ్వాలనే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధతను నెరవేర్చడంలో ఇదో కీలక ముందడుగు కానుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు 38 మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరతారు.

 

కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలో ఎంపికైనవారికి నియామక పత్రాలను అందజేస్తాయి. రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్‌లో, సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ఇండోర్‌లో, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముంబైలో, నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గువాహటిలో, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భువనేశ్వర్‌లో, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పాటియాలాలో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెన్నైలో, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు షిల్లాంగ్‌లో, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలో అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు.

 

 

భారత్ నేడు ప్రపంచంలో 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మోదీ అన్నారు. గత 8 సంత్సరాల్లో 10 వ స్థానం నుంచి 5 వ స్థానానికి చేరుకుందన్నారు. ప్రపంచంలోని అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాడుతున్నాయని వివరించారు. ఇంత ఇబ్బందులు వున్నా.. భారత్ మాత్రం పూర్తి శక్తితో కొత్త కార్యక్రమాలు చేపడుతూ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తోందని మోదీ అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70% మంది మహిళలు. ఇటీవలి సంవత్సరాలలో, 8 కోట్ల మంది మహిళలు ప్రభుత్వం ఆర్థికంగా మద్దతు ఇస్తున్న స్వయం సహాయక సంఘాలలో చేరారని మోదీ తెలిపారు.

Related Posts

Latest News Updates