పరాక్రమ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు ప్రధాని మోదీ 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా మోదీ ప్రారంభించారు. అలాగే నేతాజీ గౌరవార్థం జాతీయ స్మారకం నమూనాను కూడా ఆవిష్కరించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పేరులేని అతిపెద్ద దీవికి మొదటగా పరమవీర చక్ర అందుకున్న మేజర్ సోమనాథ్ శర్మ పేరును నామకరణం చేశారు.
రోజ్ ఐలాండ్స్ కు కొన్ని రోజుల క్రిందటే నేతాజీ పేరును పెట్టారు. వీరితో పాలుగా కరణ సింగ్, రమా రఘోబా రాణే, నాయక్ జగునాథ్ సింగ్, మేజర్ పిరూ సింగ్, కెప్టెన్ సలారియా, లెఫ్టినెంట్ కలోనెల్ ధన్ సింగ్ థపా, సుబేదార్ జోగీందర్ సింగ్, మేజర్ తయతాన్ సింగ్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా తదితరుల పేర్లను ఈ ఐలాండ్స్ కి పెట్టారు. రియల్ హీరోలకు సరైన గౌరవం లభించేందుకే ఈ నిర్ణయమని పీఎంవో పేర్కొంది.

రియల్ హీరోలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతోనే మోదీ ఈ పనికి పూనుకున్నారని పీఎంవో తెలిపింది. 21దీవులకు పరమవీర చక్ర గ్రహీతల పేర్లతో నామకరణం చేసే ఈ గొప్ప కార్యక్రమం ద్వారా త్యాగధనులు, మహాపురుషుల స్ఫూర్తి గాథలు ఇక్కడ మారుమోగుతాయని ప్రధాని తెలిపారు.

మొట్టమొదటి విముక్తి పతకాన్ని ఎగురవేసిన పుణ్యభూమి ఇదని చెప్పారు.వీర సావర్కర్ వంటి గొప్ప దేశ భక్తుల ప్రతీకగా ఈ ప్రాంతం నిలుస్తోందని ప్రధాని అన్నారు. సముద్రాలు, పర్వతాలు దాటి మారుమూల ప్రాంతాలతో సహా అణువణువునా జల్లెడ పడుతూ మన సైన్యం అందిస్తున్న దేశ రక్షణ సేవలు ఈ సందర్బంగా గుర్తు చేసుకోవలసిన తరుణం ఇదని నరేంద్ర మోడీ అన్నారు. మరోవైపు మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.












