ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి హీరాబేన్.. ఆందోళన అవసరం లేదన్న వైద్యులు

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబేన్ మోదీ అనారోగ్య కారణాలతో అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. గుజరాత్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల క్రిందటే తన తల్లిని కలుసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. ఇక… హీరాబేన్ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకోగానే.. బీజేపీ ఎమ్మెల్యేలు దర్శనాబేన్ వాఘేలా, కౌశిక్ జైన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

 

Related Posts

Latest News Updates