మోదీ డ్రెస్ పైనే అందరి లుక్.. దాని పేరు ‘చోలా డోరా’… నిరుపేద మహిళ ఇచ్చిన డ్రెస్ తో కేదార్ నాథ్ కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాథ్ మందిరాన్ని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అయితే.. ప్రధాని మోదీ కేదార్ నాథ్ ఆలయ సందర్శన సమయంలో ఓ ప్రత్యేకమైన వస్త్రధారణలో కనిపించారు. ఇప్పుడు మోదీ వేసుకున్న డ్రెస్సుపై అందరి లుక్ పడింది. దీనిపైనే అందరూ చర్చించుకుంటున్నారు.

 

 

అయితే.. కేదార్ నాథ్ దర్శనం సమయంలో ప్రధాని మోదీ ధరించిన డ్రెస్సు పేరు చోలా డోరా. హిమాచల్ లో నివసించే ఓ మహిళ ప్రధాని మోదీ కోసం ప్రత్యేకంగా చేతితో కుట్టి మరీ తయారు చేసింది. దీనిని మోదీకి బహుమతిగా బహూకరించారు. కొన్ని రోజుల క్రితం మోదీ హిమాచల్ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలోనే ఓ మహిళ చోలా డోరాను బహుమతిగా ఇచ్చింది. ఎక్కడైనా చలి ప్రదేశాలకు వెళ్లిన సమయంలో తాను కచ్చితంగా వేసుకుంటానని మోదీ ఆమెకు హామీ ఇచ్చారు. కేదార్ నాథ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దానిని ధరించారు.

Related Posts

Latest News Updates