ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 11 న విశాఖ పట్నానికి వస్తున్నారు. 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మోదీ ప్రారంభిస్తారు. తదనంతరం విశాఖ వేదికగా జరిగే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.
జూలై మాసంలోనే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. జూలై 4 న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడారు. తెలుగు వీర లేవరా… అన్న గీతాన్ని పాడుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.