విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలి : ప్రధాని మోదీ

విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ తో మహిళలు సాధికారత సాధించాలని, అయితే.. మహిళలు భాగస్వామ్యం అయితేనే… సైన్స్ సాధికారత చెందుతుందన్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా నాగపూర్ వేదికగా జరుగుతున్న భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 108వ సదస్సు ప్రారంభించారు. డేటా, టెక్నాలజీ అనే రెండు అంశాలు భారత సైన్స్ ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయన్నారు.

సైన్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ నిలించదన్నారు. భారత యువత కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. సైన్స్, పరిశోధనల్లో ఎవరైతే చొరవ తీసుకుంటారో వారే అగ్రస్థానంలో ఉంటారని, భవిష్యత్ సన్నద్ధత దిశగా అడుగులు పడాలని మోదీ సూచించారు. మరోవైపు సుస్థిరాభివృద్ధి ద్వారా మహిళల సాధికరత సాధనలో సైన్స్ అండ్ టెక్నాలజీ పద్ధతి ఈ ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిసారిస్తోంది.

Related Posts

Latest News Updates