కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి… ఎక్స్ గ్రేషియా ప్రకటన

కందుకూరులో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు సభలో 8 మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఇక… మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు.

Related Posts

Latest News Updates