గుజరాత్ లో 156 స్థానాల్లో బీజేపీ జయకేతనం… భావోద్వేగానికి లోనయ్యానంటూ మోదీ ట్వీట్

గుజరాత్ లో బీజేపీ రాకెట్ లా దూసుకుపోతోంది. ఏకంగా 156 స్థానాల్లో జయ కేతనం ఎగరేసింది. దీంతో బీజేపీ రికార్డు నెలకొల్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని స్థానాలు సాధించడం చరిత్రలో ఇదే ప్రథమం. కాంగ్రెస్ అప్పటి నేత సోలంకీ ఆధ్వర్యంలో1995 లో కాంగ్రెస్ 149 సీట్లను సాధించింది. ఇదే ఇప్పటి వరకూ రికార్డు. దీనిని బీజేపీ నరేంద్ర మోదీ సారథ్యంలో బ్రేక్ చేసింది. ఇక… ఈ బంపర్ విక్టరీపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. సాధారణ విజయాన్ని కట్టబెట్టిన గుజరాత్ జనశక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ థ్యాంక్యూ గుజరాత్. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి నేను చాలా భావోద్వేగాలకు లోనయ్యాను. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిపూర్వక పరిస్థితులను కొనసాగించాలనే కోరికను ప్రజలు తెలియజేశారు. గుజరాత్ జనశక్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

12 న సీఎం ప్రమాణ స్వీకారం.. హాజరు కానున్న ప్రధాని మోదీ

ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. ఇక… గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. సీఎంకి, రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ ఎప్పుడూ చరిత్రను నెలకొల్పే పనులే చేసిందని, మోదీ డెవలప్ మెంట్ నమూనాపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి ప్రతీక ఈ విజయం అని షా అభివర్ణించారు.

Related Posts

Latest News Updates