ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19 న హైదరాబాద్ కి రావాల్సి వుంది. వందే భారత్ రైలును ప్రారంభించడంతో పాటు.. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి వుంది. అయితే… ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ వల్లే పర్యటన వాయిదా పడిందని తెలంగాణ బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడిందని పీఎంవో అధికారులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించారు. అయితే… ప్రధాని మోదీ పర్యటన మళ్లీ ఎప్పుడు వుంటుందో అతి త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది. మోదీ పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, అతి త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ తెలిపింది.