కేంద్ర-రాష్ట్ర సైన్స్ కాన్‌క్లేవ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో రెండు రోజుల పాటు ఈ కాన్‌క్లేవ్ జరగనుంది. అయితే మొట్టమొదటి సారిగా సెంటర్-స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్ అనే పేరుతో ఈ సారి ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ , బిహార్ మినహా అన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… సెంటర్- స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్’ మన ‘సబ్ కా ప్రయాస్’ మంత్రానికి ఉదాహరణ అని ప్రధాని మోడీ చెప్పారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తొలిసారిగా ఈ కేంద్ర రాష్ట్ర సైన్స్ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలు, యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకోవచ్చన్నారు. భారతదేశం నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తుందన్న మోడీ, భారతదేశ సైన్స్ అభివృద్ధికి, ఈ రంగానికి సంబంధించిన వ్యక్తుల పాత్ర చాలా ముఖ్యమైనది చెప్పుకొచ్చారు. నేటి యువత సాంకేతికతకు త్వరగా అలవాటు పడుతున్నారని మోడీ అన్నారు