కాశీ భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని… తమిళనాడు పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం : మోదీ

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ వేదికగా కాశీ- తమిళ సంగమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులైన పంచెకట్టుతో హాజరయ్యారు. మోదీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు, కాశీ మధ్య సంబంధాలను బలపరిచేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… దేశంలో ఈ కార్యక్రమం అద్భుతమైన పాత్ర పోషిస్తుందని, గంగా యమునా అంత పవిత్రమైందన్నారు. ఈ సంగమం భారతదేశంలోని విభిన్న సంస్కృతుల వేడుక అని అభివర్ణించారు.

 

కాశీ నగరం భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక రాజధాని అయితే, తమిళనాడు భారతదేశపు పురాతన చరిత్రను కలిగి ఉంటుందన్నారు. భారత్ ఓ అమృత్ కాలం లోకి ప్రవేశించిన సమయంలో ఈ సమావేశం నడుస్తోందని, భారత్ గత 1000 సంవత్సరాలుగా సాంస్కృతిక ఐక్యతను అనుసరిస్తున్న దేశమని మోదీ పేర్కొన్నారు. కాశీ అభివృద్ధిలో తమిళనాడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. తమిళనాడుకు చెందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్-ఛాన్సలర్‌గా బీహెచ్‌యూకి విపరీతమైన సహకారం అందించారని మోదీ గుర్తు చేసుకున్నారు.

Related Posts

Latest News Updates