ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో పలు డెవలప్ మెంట్ పనులకు ప్రధాని మోదీ రిమోట్ ద్వారా శంకుస్థాపనలు చేశారు. 5 జాతీయ రహదారులకు, బీబీనగర్ ఎయిమ్స్ డెవలప్ మెంట్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను కూడా ప్రారంభించారు. 11,355 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ప్రారంభించారు.
ఇక… తదనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఎక్కడా అధికార బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా… పరోక్షంగా బీఆర్ఎస్ ను, ప్రాంతీయ పార్టీలను ఏకిపారేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా మీ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులోనే ప్రసంగం ప్రారంభించారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వేంకటేశ్వర స్వామి నగరంతో కలిపామన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 70 కీమీ మెట్రో నెట్ వర్క్ నిర్మించామని తెలిపారు. తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను స్టార్ట్ చేస్తున్నామని మోడీ తెలిపారు.
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తున్నారని, ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని మోదీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేశామని, తెలంగాణలో హైవే నెట్ వర్క్ ను వేగంగా తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 70 కీమీ మెట్రో నెట్ వర్క్ నిర్మించామని తెలిపారు. తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను స్టార్ట్ చేస్తున్నామని మోడీ తెలిపారు. హైదరాబాద్ బెంగళూరు అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నామని, తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నామన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదని, కేంద్రం ప్రగతి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోందన్నారు. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
కుటుంబపాలన అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు ప్రధాని మోడీ. కుటుంబ పాలకులే అన్నింటిపైనా కంట్రోల్ కోరుకుంటారని.. అలాంటి వారి వల్ల ప్రజలకు నష్టమన్నారు. అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా లేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు.