ఉగ్రదాడి ఏ స్థాయిలో జరిగినా… ప్రతిస్పందన తీవ్రంగా వుండాలి : ప్రధాని మోదీ

ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న నో మనీ ఫర్ టెర్రర్ అనే అంతర్జాతీయ సదస్సును మోదీ ప్రారంభించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూతమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

 

 

ఇప్పటి వరకూ భారత్ పై అనేక ఉగ్రదాడులు జరిగాయని, అందులో ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ… ఉగ్రవాదంపై ధైర్యంతో పోరాడుతున్నామని, దానిని నిర్మూలించేంత వరకూ పోరాటం చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రజలందరూ క్షేమంగా వుండాలని కోరుకుంటే మాత్రం… ఉగ్రవాదులను వెంబడించి, హతం చేయాలని అన్నారు. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని మోదీ మండిపడ్డారు. అలాగే ఉగ్రవాదులకు ఆర్థికంగా కూడా అండగా వుంటున్నాయన్నారు. అలాంటి వారిపై ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates