ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు : ప్రధాని మోదీ

ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లి స్థిరపడినా… ప్రవాస భారతీయులు విజయాలను పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారి అనుభవాలను, విజయాలను డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం వుందని సూచించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 17 వ ప్రవాస భారతీయ దివస్ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్‌సాద్‌ సంతోఖి, గుయానా అధ్యక్షుడు మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులు విదేశీ గడ్డపై భారత్ కు వారే బ్రాండ్ అంబాసిడర్లని, వారి పాత్ర చాలా కీలకమన్నారు. యోగా, ఆయుర్వేదం, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, చిరు ధాన్యాల విషయంలో ప్రవాసులే బ్రాండ్ అంబాసిడర్లు అని వివరించారు. వసుధైక కుటుంబం అన్న భావన ప్రవాసీయుల వల్లే బలోపేతమవుతోందన్నారు. భారత్ వందేళ్ల ప్రస్థానానికి చేరుకునే క్రమంలో ఆరంభించిన అమృత కాలంలో ప్రవాసీయులు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates