‘పరాక్రమ దివస్’ సందర్భంగా నేతాజీకి నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

పరాక్రమ దివస్, నేజాతీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీకి ట్విట్టర్ వేదికగా ఘనంగా నివాళులు అర్పించారు. వలస పాలనను తీవ్రంగా ప్రతిఘటిస్తూ… ఉద్యమాలు చేసిన నేతాజీ ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ కొనియాడారు. నేతాజీ ఆలోచనలకు తాము తీవ్రంగా ప్రభావితం అయ్యామని, ఆయన కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తున్నామని వివరించారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని ప్రధాని మోదీ  కొనియాడారు.

ఇక.. రాష్ట్రపతి ముర్ము కూడా నేతాజీకి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. పరాక్రమ దివస్, నేతాజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు ముర్ము పేర్కొన్నారు. ఎనలేని ధైర్యానికి, దేశభక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. నేతాజీ పిలుపు, ఆలోచనలతో లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, దేశ స్వాతంత్రం పోరాడారని ముర్ము పేర్కొన్నారు. ఆయనకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates