దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్క్లు ధరించి… చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. ఆదివారం మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. అయితే కరోనా కారణంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వీయ రక్షణే కరోనాకు మందు అని చెప్పారు.భారత్ 220 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి.. నమ్మలేని రికార్డును సృష్టించిందన్నారు. స్మాల్‌పాక్స్, పోలియో వంటి వ్యాధులను భారత్ తుడిచిపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం కాలా అజర్ అనే వ్యాధి బీహార్, జార్ఖండ్ లోని 4 జిల్లాల్లో మాత్రమే ఉందన్నారు… దాన్ని కూడా అంతం చేస్తామన్నారు.
2022 భారత దేవానికి అనేక విధాలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. దేశం ఐదో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. అంతరిక్షం, డ్రోన్ రంగాలలో కొత్త పురోగతిని సాధించిందని, క్రీడలలో దేశం సాధించిందన్నారు. ఈ యేడాది జీ 20 కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 2023లో G20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దామన్నారు.