అస్వస్థతకు గురై అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తల్లి హీరాబెన్ ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు ప్రధాని ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు ఆస్పత్రిలోనే వున్న మోదీ…. తన తల్లి ఆరోగ్యం, చికిత్స అందిస్తున్న విధానాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఢిల్లీకి పయనమయ్యారు. మరోవైపు మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ట్వీట్ చేశారు. వీరితో పాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, తదితరులు కూడా ఆకాంక్షించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబేన్ మోదీ అనారోగ్య కారణాలతో అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. గుజరాత్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల క్రిందటే తన తల్లిని కలుసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. ఇక… హీరాబేన్ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకోగానే.. బీజేపీ ఎమ్మెల్యేలు దర్శనాబేన్ వాఘేలా, కౌశిక్ జైన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.