త్వరలోనే దేశంలోనే విమానాల తయారీ… శివమొగ్గ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మోదీ ప్రకటన

కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్‭పోర్ట్‭ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తదితరులు పాల్గొన్నారు. అయితే… నేడే మాజీ సీఎం యడియూరప్ప పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా మోదీ ఆయన చేయి పట్టుకొని…. విమానాశ్రయం కార్యక్రమానికి వెళ్లడం ఆసక్తిగా మారింది. యడియూరప్పకు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో భారత్కు వేలాది విమానాలు అవసరం పడుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

ఈ రంగంలో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారత్కు విమానాలు దిగుమతి అవుతున్నాయని.. త్వరలోనే విమానాలను భారత్లోనే తయారు చేస్తామని మోడీ పేర్కొన్నారు.రానున్న రోజుల్లో భారతదేశానికి వేలాది విమానాలు అవసరమవుతాయని, మేడ్ ఇన్ ఇండియా ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఇక.. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికే పదే పదే అవకాశం ఇవ్వాలని కర్నాటక ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Related Posts

Latest News Updates