దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం తుమకూరు

కర్నాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని మోదీ ప్రారంభించారు. తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్ ను కూడా మోదీ ఆవిష్కరించారు. ఇది భారత దేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ప్రారంభ కాలంలో లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఇది ఉత్పత్తి చేస్తుంది. అయితే… ఈ హెలికాప్టర్ స్పెషల్ ఏంటంటే… దేశీయంగా రూపొందించబడింది. 3 టన్నుల బరువుతో పాటు ఒకే ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ హెలికాప్టర్. అనేక ప్రత్యేక లక్షణాలు కూడా దీని సొంతం. ఈ హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రంలో..హెలి -రన్ వే, ఫ్లైట్ హ్యాంగర్, ఫైనల్ అసెంబ్లీ హ్యాంగర్, స్ట్రక్చర్ అసెంబ్లీ హ్యాంగర్, ఎయిర్ కంట్రోల్, వివిధ సపోర్టింట్ సర్వీస్ లు అందుబాటులో ఉండనున్నాయి.

మొట్ట మొదటగా తుమకూరులోని ఈ ఉత్పత్తి కేంద్రం 30 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. దశ వారీగా పెంచనున్నారు. అంటే… సంవత్సరానికి 90 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయనుంది. కేవలం తేలికపాటి హెలికాప్టర్లే కాకుండా…. యుద్ధంలో వినియోగించే హెలికాప్టర్లు, ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్లను కూడా ఉత్పత్తి చేయనున్నారు. రానూ రానూ ఈ ఉత్పత్తి కేంద్రం LCH, LUH, సివిల్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH), IMRH నిర్వహణ, మరమ్మత్తు మరియు మరమ్మత్తు కోసం కూడా ఉపయోగించబడుతుంది. ఈ కర్మాగారం 615 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. భారత్ కి అవసరమైన హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే సమకూర్చాలన్న ఉద్దేశంతోనే దీనిని నెలకొల్పారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యూనిట్​ ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అతిపెద్ద హెలీకాప్టర్ ఫ్యాక్టరీ తుమకూరు జిల్లాలో ఏర్పాటైందని, రాష్ట్రంలోని యువతకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. దీనికితోడు జిల్లాలో ప్రతీ ఇంటికి మంచినీరు అందజేసే ప్రాజెక్టులను కూడా ప్రారంభించామన్నారు. కర్నాటక ఇన్నోవేషన్​కు కేరాఫ్ అడ్రస్​గా నిలిచిందని, డ్రోన్లు, తేజస్ ఫైటర్ జెట్స్ ఇక్కడే తయారవుతున్నాయని కొనియాడారు. ఎంతో మంది ఇన్వెస్టర్లు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్నాటకను ఎంచుకుంటున్నారని, డబుల్​ ఇంజిన్​ సర్కార్ ఎలా పని చేస్తున్నదో చెప్పడానికి ఈ హెలీకాప్టర్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటే నిదర్శనమని మోదీ ఉదహరించారు.

 

Related Posts

Latest News Updates